Kasibugga SI: గుర్తు తెలియని శవాన్ని స్వయంగా మోసుకొచ్చిన కాశీబుగ్గ మహిళా ఎస్సై

Kasibugga SI Sirisha carries an unidentified man dead body for two kilometers

  • శ్రీకాకుళం జిల్లాలో ఘటన
  • అడివికొత్తూరులో గుర్తుతెలియని మృతదేహం
  • స్ట్రెచర్ పై మోసుకొచ్చిన లేడీ ఎస్సై
  • అనాథ ప్రేతానికి అంత్యక్రియలు
  • ఎస్సై శిరీషకు డీజీపీ అభినందనలు

శ్రీకాకుళం కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీషపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడివికొత్తూరు గ్రామం పొలాల్లో ఓ గుర్తుతెలియని మృతదేహం పడివుండగా, ఆ మృతదేహాన్ని స్థానికుల సాయంతో మహిళా ఎస్సై స్వయంగా మోసుకుని తీసుకువచ్చారు. దాదాపు 2 కిలోమీటర్లు మోసుకుని రావడమే కాకుండా, అంత్యక్రియలు కూడా జరిపించారు.

ఎస్సై శిరీష పొలం గట్లు, అటవీప్రాంతాలు దాటుకుంటూ ఓ స్ట్రెచర్ పై మోసుకురావడం పట్ల సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన వస్తోంది. ఏపీ పోలీస్ విభాగం కూడా ఎస్సై శిరీషను అభినందిస్తూ ట్వీట్ చేసింది. ఆమె వీడియోను కూడా పంచుకుంది. కాశీబుగ్గ ఎస్సై శిరీష మానవీయ దృక్పథాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ కొనియాడారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News