David Warner: రీఫేస్ యాప్ తో 'ఆచార్య'గా మారిన డేవిడ్ వార్నర్

David Warner transforms into Acharya with the help of Reface App

  • టిక్ టాక్ వీడియోలతో వార్నర్ సందడి
  • ఇటీవలే విడుదలైన ఆచార్య టీజర్
  • చిరంజీవిలా మారి డైలాగులు చెప్పిన వార్నర్
  • నెట్టింట సందడి చేస్తున్న వీడియో

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు మన టాలీవుడ్ అంటే ఎంతిష్టమో తెలిసిందే. ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ప్రాతినిధ్యం వహించే వార్నర్... తెలుగు సినిమాలను బాగా ఫాలో అవుతుంటాడు. అందుకే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తెలుగు సినీ హీరోలను అనుకరిస్తూ టిక్ టాక్ వీడియోలు చేస్తుంటాడు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలా మారిపోయాడు. రీఫేస్ యాప్ సాయంతో ఆచార్యలా తయారైన వార్నర్... అచ్చం మెగాస్టార్ ను తలపించేలా డైలాగులు చెప్పడం చూడొచ్చు.

ఈ తాజా వీడియో అభిమానులను విశేషంగా అలరిస్తోంది. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ ఆసీస్ క్రికెటర్ మహేశ్ బాబు, ప్రభాస్ వంటి హీరోలను అనుకరిస్తూ స్పూఫ్ లు, అల్లు అర్జున్ పాటలకు డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో బాగా సందడి చేశాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News