Amit Shah: మమతా బెనర్జీ మేనల్లుడి పబ్బం గడపడంలోనే తరించిపోతున్నారు: అమిత్ షా

 Amit Shah take dig at Mamat Banarjee

  • మమతా బెనర్జీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం
  • హౌరా సభలో అమిత్ షా విమర్శనాస్త్రాలు
  • మమత ప్రజల ఆకాంక్షలు వమ్ము చేశారని వ్యాఖ్యలు
  • అందుకే టీఎంసీ నేతలు బీజేపీలోకి వస్తున్నారని వెల్లడి

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నేడు కోల్ కతా శివారు ప్రాంతం హౌరాలో జరిగిన సభలో అమిత్ షా విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ ముఖ్యమంత్రిగా ప్రజల ఆకాంక్షలను మమతా బెనర్జీ వమ్ము చేశారని, అందుకే టీఎంసీ నుంచి బీజేపీలోకి నేతల వలసలు సాగుతున్నాయని అన్నారు.

లోక కల్యాణం కోసం మోదీ సర్కారు కృషి చేస్తుంటే... మేనల్లుడి పబ్బం గడపడంలోనే మమత సర్కారు తరించిపోతోందని తెలిపారు. డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ బెనర్జీ సీఎం మమతా బెనర్జీకి స్వయానా మేనల్లుడు. ఇతర పార్టీల నుంచి నేతలంతా బీజేపీ బాట పడుతున్నారని, ఎన్నికల నాటికి టీఎంసీలో మమతా ఒక్కరే మిగులుతారని వెల్లడించారు.

Amit Shah
Mamata Banerjee
Abhishek Banarjee
BJP
TMC
West Bengal
  • Loading...

More Telugu News