Nominations: ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం

AP Gram Panchayat Polls

  • ఏపీలో ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికలు
  • ఆఖరిరోజున భారీగా నామినేషన్లు
  • రేపు నామినేషన్లు పరిశీలించనున్న అధికారులు
  • ఫిబ్రవరి 4న ఉపసంహరణకు తుది గడువు

ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నేటితో నామినేషన్ల స్వీకరణ ముగిసింది. ఇవాళ ఆఖరిరోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 29న సర్పంచులకు 1,317 నామినేషన్లు, వార్డులకు 2,200 నామినేషన్లు దాఖలయ్యాయి. 30వ తేదీన సర్పంచులకు 7,460... వార్డులకు 23,318 నామినేషన్లు వచ్చాయి.

కాగా, అధికారులు రేపు నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఫిబ్రవరి 9న తొలిదశ పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ఉంటుంది. కాగా, ఏపీలో తొలిదశలో 3,249 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 32,504 వార్డుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

Nominations
Gram Panchayat Elections
Andhra Pradesh
Elections
  • Loading...

More Telugu News