Pradhan Soy: తల్లిని చంపి ఆమె చితిపై కోడి మాంసం కాల్చుకుని తిన్న ఉన్మాది!

Man kills his mother and roast chicken on her pyre

  • ఝార్ఖండ్ లో భీతావహ ఘటన
  • తాగి ఇంటికొచ్చిన తనయుడు
  • మందలించిన తల్లి
  • కోపోద్రిక్తుడై తల్లిని హత్య చేసిన కుమారుడు
  • ఇంటి పెరట్లో దహనం చేసేందుకు ప్రయత్నం

ఝార్ఖండ్ లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. తల్లిని హత్య చేసిన తనయుడు ఆమె చితిపై చికెన్ కాల్చుకుని తిన్న సంఘటన పశ్చిమ సింగ్భమ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ ఉన్మాది పేరు ప్రధాన్ సోయ్ (35). అయితే, మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ప్రధాన్ పట్ల తల్లి సుమీ సోయ్ (60) ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లి తనను తిట్టడాన్ని భరించలేని ప్రధాన్ ఓ కర్రతో కొట్టడంతో ఆ వృద్ధురాలు మరణించింది. ఆపై తల్లి మృతదేహాన్ని తన ఇంటి పెరట్లో దహనం చేసేందుకు ప్రయత్నించాడు.

అంతేకాదు, తల్లి చితి మండుతుండగా, ఆ మంటల్లో కోడి మాంసం కాల్చుకుని తినడం అతని సోదరి సోమ్వారీ కంటబడింది. దాంతో ఆమె స్థానికులకు సమాచారం అందించడంతో, వారు పోలీసులకు విషయం తెలియజేశారు. పోలీసులు ప్రధాన్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా, అతడు నాలుగేళ్ల కిందట తండ్రిని కూడా హత్య చేసినట్టు గుర్తించారు.

Pradhan Soy
Sumi
Murder
Pyre
Chicken
  • Loading...

More Telugu News