Mahesh Babu: దుబాయ్ లో కరోనా నిబంధనలు అమలు చేస్తున్న తీరు సురక్షితమైన ఫీలింగ్ కలిగిస్తోంది: మహేశ్ బాబు

Mahesh Babu talks about Dubai shooting experience

  • 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్న మహేశ్ బాబు
  • దుబాయ్ లో షూటింగ్ ప్రారంభం
  • దుబాయ్ తనకెంతో ఇష్టమైన ప్రదేశమన్న మహేశ్ బాబు
  • గతంలో అనేకసార్లు వచ్చానని వెల్లడి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం' సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ కోసం దుబాయ్ లో ఉన్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు స్పందించారు. దుబాయ్ తనకెంతో ఇష్టమైన టూరిస్టు స్పాట్ అని తెలిపారు. ఈ ప్రాంతం చాలా అందంగా రమణీయంగా ఉంటుందని, గతంలో ఎన్నోసార్లు దుబాయ్ వచ్చానని వివరించారు.

ప్రస్తుతం కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తున్న పరిస్థితుల్లో దుబాయ్ లో అమలు చేస్తున్న నిబంధనల కారణంగా ఎంతో భద్రంగా ఉన్నామన్న ఫీలింగ్ కలుగుతోందని అన్నారు. చిత్రబృందం కూడా ఎంతో సురక్షితంగా ఉన్నామన్న భావనలో ఉందని మహేశ్ బాబు తెలిపారు. ఫిబ్రవరిలో కూడా 'సర్కారు వారి పాట' షూటింగ్ ఇక్కడే కొనసాగుతుందని వెల్లడించారు.

లాక్ డౌన్ తర్వాత మహేశ్ బాబు షూటింగ్ లో పాల్గొంటున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News