Chandrababu: అపహరణకు గురైన సర్పంచి అభ్యర్థితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు

Chandrababu phone call to TDP Sarpanch Candidate

  • ఏపీలో పంచాయతీ సమరం
  • రాయదుర్గం నియోజకర్గంలో కిడ్నాప్ కలకలం
  • కిడ్నాపర్ల వల నుంచి తప్పించుకున్న టీడీపీ నేత
  • ధైర్యంగా నామినేషన్ వేయాలన్న చంద్రబాబు
  • టీడీపీ అండగా ఉంటుందని హామీ

ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వాడీవేడి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి! కాగా, రాయదుర్గం టీడీపీ నాయకుడు ఈరన్న నిన్న అపహరణకు గురవడం కలకలం రేపింది. ఈరన్న పంచాయతీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా బానేపల్లి సర్పంచి అభ్యర్థిగా ఉన్నారు. కాగా, అపహరణకు గురైన ఈరన్న కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఈరన్నతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ లో మాట్లాడారు.

ఈరన్న తన అపహరణ ఘటనపై చంద్రబాబుకు వివరించారు. పోటీ చేస్తే చంపేస్తామని బెదిరించారని వాపోయారు. ఈ సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. ధైర్యంగా నామినేషన్ వేయాలని ఈరన్నకు సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా టీడీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

Chandrababu
Phone Call
Eeranna
Sarpanch Candidate
Kidnap
  • Loading...

More Telugu News