aiadmk: త‌మిళ‌నాడులో అన్నాడీఎంకేతో పొత్తుపై స్ప‌ష్ట‌త‌నిచ్చిన న‌డ్డా!

nadda gives clarity on aiadmk alliance
  • త‌మిళ‌నాడులో జేపీ న‌డ్డా ప‌ర్య‌ట‌న‌
  • మ‌ధురైలో జ‌రిగిన స‌భ‌లో పాల్గొన్న న‌డ్డా
  • అన్నాడీఎంకేతో పొత్తు కొన‌సాగుతుంద‌ని వ్యాఖ్య‌
  • సీఎం అభ్య‌ర్థిపై మాత్రం నో క్లారిటీ
త్వ‌ర‌లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధురైలో జరిగిన సభలో పాల్గొని మాట్లాడుతూ త‌మిళ‌నాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై స్ప‌ష్టత‌నిచ్చారు. ఇరు పార్టీల‌ మధ్య ఉన్న‌ పొత్తు ఇకపైనా కొనసాగుతుందని చెప్పారు.

త‌మిళ‌నాడులో త‌మ కూట‌మి నుంచి ముఖ్య‌మంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై మాత్రం స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు. అసెంబ్లీ ఎన్నికల అనంత‌రం పరిస్థితుల‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నేత‌లు అంటున్నారు. కాగా,  మధురైలో జరిగిన సభలో పాల్లొనే ముందు జేపీ న‌డ్డా మీనాక్షి దేవాలయాన్ని సందర్శించి, పూజ‌ల్లో పాల్గొన్నారు. అనంత‌రం పార్టీ కోర్ కమిటీ సమావేశంలో నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు.
aiadmk
BJP
JP Nadda
Tamilnadu

More Telugu News