Antony Fouzy: ఏప్రిల్ నాటికి అమెరికాను యూకే వేరియంట్ కరోనా బెంబేలెత్తిస్తుంది: ఆంటోనీ ఫౌజీ
- యూకే నుంచి పలు దేశాలకు పాకిన కొత్త కరోనా వైరస్
- అమెరికాలో 28 రాష్ట్రాలకు విస్తరించిన వైరస్
- అమెరికాలో నెమ్మదిగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
కరోనా వైరస్ వల్ల యావత్ ప్రపంచం కుదేలైంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాలు ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు అందుబాటులోకి వస్తున్నాయి. మరోవైపు అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు అంటోనీ ఫౌజీ ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. యూకేలో బయటపడిన కరోనా కొత్త వైరస్ ఏప్రిల్ నాటికి అమెరికాలో ప్రబలంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దక్షిణాఫ్రికా వేరియంట్ పై మాత్రం ఇంకా పూర్తి స్పష్టత రాలేదని తెలిపారు.
యూకే వైరస్ ఇప్పటికే అమెరికాలోని దాదాపు 28 రాష్ట్రాలకు వ్యాపించింది. ఇప్పటికే 315 కేసులు నమోదయ్యాయి. మరోవైపు అమెరికాలో ఇప్పటి వరకు 2.89 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఒక డోసు ఇచ్చారు. అయితే వ్యాక్సినేషన్ అనుకున్న దానికంటే నెమ్మదిగా కొనసాగుతోందనే విమర్శలు వస్తున్నాయి.