Jagan: మహాత్మాగాంధీకి నివాళి అర్పించిన ఏపీ ముఖ్యమంత్రి

Jagan pays tributes to Mahatma Gandhi
  • మహాత్ముడి వర్ధంతి సందర్భంగా జగన్ నివాళి
  • తన నివాసంలో మహాత్ముడికి అంజలి ఘటించిన సీఎం
  • అందరూ మహాత్ముడి బాటలో నడవాలని పిలుపు
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాళి అర్పించారు. తన నివాసంలో మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. మహాత్ముడి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. ఆయన సూచించిన అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు మంత్రి వెల్లంపల్లి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు.
Jagan
YSRCP
Mahatma Gandhi

More Telugu News