Kalva Srinivasulu: వైసీపీ ప్రభుత్వం లక్షల్లో రేషన్ కార్డులను తొలగించింది: కాల్వ శ్రీనివాసులు

YSRCP govt removed laks of ration cards says Kalva Srinivasulu

  • నవరత్నాల పేరుతో జనాలను జగన్ ముంచేశారు
  • పింఛను అందక జనాలు ఇబ్బంది పడుతున్నారు
  • బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగడం జగన్ కు ఇష్టం లేదు

ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రజలను జగన్ నిండా ముంచారని చెప్పారు. పింఛను రూ. 3 వేలు ఇస్తామని చెప్పిన జగన్... కేవలం రూ. 250 మాత్రమే పెంచి చేతులు దులుపుకున్నారని అన్నారు. అర్హులైన లబ్ధిదారులు పింఛను అందక ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. లక్షల సంఖ్యలో రేషన్ కార్డులను తొలగించారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలపై జగన్ కు ప్రేమ లేదని... వారు రాజకీయంగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదని అన్నారు. రైతు భరోసా పేరుతో రైతలను మోసం చేస్తున్నారని చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News