Economic Survey: కేంద్ర ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు ఇవిగో!

Centre economic survey details

  • ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
  • రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో షురూ
  • ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టిన కేంద్రం
  • సర్వే వివరాలు వెల్లడించిన ఆర్థిక సలహాదారు
  • ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించిన అనంతరం సమావేశాలు షురూ అయ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు లాంఛనంగా తీసుకువచ్చే కేంద్ర ఆర్థిక సర్వేను ఇవాళ సభ ముందుకు తీసుకువచ్చారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఆర్థిక సర్వే, బడ్జెట్ అంతా డిజిటల్ పద్ధతిలో చేపడుతున్నారు. అందుకే ఇవాళ విడుదలైన ఆర్థిక సర్వే ప్రతులను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు.

ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు ఇవిగో...

  • భారత్ 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి ప్రత్యేక శ్రద్ధ
  • దేశవ్యాప్తంగా పెట్టుబడులను పెంచే చర్యలకు అత్యధిక ప్రాధాన్యత
  • వ్యాపార కార్యకలాపాల పెరుగుదలకు తక్కువ వడ్డీ
  • కరోనా ప్రభావంతో మందగించిన ఆర్థిక వ్యవస్థలో క్రమంగా పురోగతి
  • వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో పునరుద్ధరణ
  • దేశవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీల ఉద్యమం
  • దేశంలో 41,061 స్టార్టప్ ల గుర్తింపు
  • స్టార్టప్ ల ద్వారా 4.7 లక్షల మందికి ఉపాధి
  • రూ.10 వేల కోట్ల ఫండ్ ఉన్న స్టార్టప్ ల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా నిధుల విడుదల
  • 2020 నాటికి సెబీలో నమోదైన 60 ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు రూ.4,326 కోట్లు అందించడానికి సిడ్నీ సంసిద్ధం
  • కొవిడ్ సమయంలో ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే సానుకూల వృద్ధి నమోదు చేసిన వైనం
  • లాక్ డౌన్ కాలంలో తీవ్రంగా దెబ్బతిన్న ఉత్పత్తి, నిర్మాణ రంగాలు
  • జూలై నుంచి పుంజుకున్న ఇళ్ల అమ్మకాలు, కోలుకున్న రియల్ ఎస్టేట్ రంగం
  • భారతదేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ అంశంపై ఆర్థిక సర్వే అసంతృప్తి
  • రేటింగ్ ఏజెన్సీలు పారదర్శకంగా వ్యవహరించాలన్న సర్వే
  • ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా మదింపు ఉండాలని సూచన
  • కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు ఆర్థిక సర్వే సమర్థన
  • దీర్ఘకాలంలో చిన్న, మధ్య తరహా రైతుల ఆదాయం పెరుగుతుందని వెల్లడి
  • పంటల్ని ఎక్కడైనా విక్రయించుకునే స్వేచ్ఛ వల్ల రైతులు అధిక ధర పొందుతారని వివరణ
  • కరోనాతో యావత్ ప్రపంచం స్తంభించినా నిలదొక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థ
  • తగినంతగా ఫారెక్స్ నిల్వలు, దృఢమైన కరెంట్ ఖాతా, ఉత్పత్తి రంగం నుంచి సానుకూల ధోరణి భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచాయన్న ఆర్థిక సర్వే
  • 2021-22 ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి 11 శాతంగా ఉంటుందని అంచనా
  • మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి 7.7 శాతంగా ఉండొచ్చని అంచనా
  • ఆలిండియా లెవల్లో నిరుద్యోగిత రేటు 2017-18లో 6.1 శాతం ఉండగా, 2018-19 నాటికి అది 5.8 శాతానికి తగ్గినట్టు ఆర్థిక సర్వే వెల్లడి
  • కరోనా నివారణ, నియంత్రణ చర్యలపైనా ఆర్థిక సర్వే పరిశీలన
  • తెలుగు రాష్ట్రాలకు అభినందనలు
  • కరోనాను కట్టడి చేయడంలో ఏపీ, తెలంగాణ సమర్థంగా వ్యవహరించాయని కితాబు
  • మహారాష్ట్ర దారుణంగా విఫలమైందని వెల్లడి

ఈ మేరకు కేంద్ర ఆర్థిక సర్వేని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ వివరించారు. కాగా, ఈ ఆర్థిక సర్వేని కరోనా నుంచి దేశాన్ని కాపాడిన యోధులకు అంకితమిస్తున్నట్ట సుబ్రమణియన్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇక, ఫిబ్రవరి 1న కేంద్ర వార్షిక బడ్జెట్ రానున్న తరుణంలో ఇక అందరి దృష్టి అటువైపు మళ్లింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారన్నదానిపై అంచనాలు మొదలయ్యాయి.

  • Loading...

More Telugu News