Indigo: మార్చి 28 నుంచి కర్నూలు నుంచి ఇండిగో విమాన సర్వీసులు

Indigo planes from Kurnool

  • ఉడాన్ పథకంలో భాగంగా విమాన సర్వీసులు
  • చెన్నై, విశాఖ, బెంగళూరు నగరాలకు విమానాలు
  • ప్రాంతీయ అనుసంధానత పెంచే దిశగా చర్యలు
  • ఓ ప్రకటనలో వెల్లడించిన ఇండిగో

భారత్ లో చిన్న నగరాలకు కూడా విమాన సేవలు అందించాలన్న పథకం ఉడాన్. ఈ పథకంలో భాగంగా ఇండిగో సంస్థ ఏపీలోని కర్నూలు నుంచి ఇతర నగరాలకు విమాన సర్వీసులు నడపనుంది. మార్చి 28 నుంచి ఇండిగో సంస్థ కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాలు నడపనుంది. విశాఖ-కర్నూలు, బెంగళూరు-కర్నూలు, చెన్నై-కర్నూలు మార్గాల్లో వారానికి నాలుగు సర్వీసులు ఉంటాయి. ఈ మేరకు ఇండిగో సంస్థ ఓ ప్రకటన చేసింది. దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ అనుసంధానతను పెంచే దిశగా ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు ఇండిగో వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News