AP CS: ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ ని మేం తిరస్కరించాం... మీరు కూడా వెనక్కి పంపండి: కేంద్రానికి ఏపీ సీఎస్ లేఖ

  • ద్వివేది, గిరిజాశంకర్ లపై ఎస్ఈసీ అభిశంసన
  • సెన్సూర్ ప్రొసీడింగ్స్ జారీ
  • తిప్పిపంపిన ఏపీ సర్కారు
  • ఎస్ఈసీ తీరు ఆక్షేపణీయం అంటూ కేంద్రానికి లేఖ
AP CS writes Centre to reject censure proceedings

ఇటీవల ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర పంచాయతీ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లను అభిశంసిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు ప్రొసీడింగ్స్ పంపారు. ఈ ప్రొసీడింగ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఎస్ఈసీకే పంపింది. అంతేకాదు, ఆ ప్రొసీడింగ్స్ ను స్వీకరించవద్దంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. ద్వివేది, గిరిజా శంకర్ లపై ప్రొసీడింగ్స్ ను వెనక్కి పంపాలని కోరారు.

ఆ ఇద్దరు ఐఏఎస్ లపై ఎస్ఈసీ అవమానకర రీతిలో ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఓటర్ల జాబితా సవరించలేదని సెన్సూర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారని ఆరోపించారు. ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారుల వివరణ కోరకుండానే సెన్సూర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారని వివరించారు. ఇలా ప్రొసీడింగ్స్ ఇవ్వడం ప్రభుత్వ అధికార పరిధి అతిక్రమణే అని సీఎస్ స్పష్టం చేశారు.

సెన్సూర్ ప్రొసీడింగ్స్ తక్కువస్థాయి ఉల్లంఘన కిందికి వస్తుందని, ఇది రాష్ట్ర పరిధిలోని విషయం అని తెలిపారు. అందుకే ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని వెల్లడించారు. కేంద్రం కూడా ఎస్ఈసీ సెన్సూర్ ప్రొసీడింగ్స్ ను పరిగణనలోకి తీసుకోవద్దని సీఎస్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. అధికార పరిధి అతిక్రమణ సరికాదని ఎస్ఈసీకి తెలపాలని కోరారు.

More Telugu News