Pamela Anderson: బాడీగార్డును పెళ్లి చేసుకున్న శృంగార తార పమేలా అండర్సన్

Pamela Anderson marries her bodyguard

  • ఇప్పటికే ఐదు పెళ్లిళ్లు చేసుకున్న పమేలా
  • బాడీగార్డ్ ను ఆరో పెళ్లి చేసుకున్న వైనం
  • లాక్ డౌన్ సమయంలో పెళ్లాడినట్టు వెల్లడి

బేవాచ్ సిరీస్ భామ, హాలీవుడ్ శృంగార తార పమేలా అండర్సన్ (53)కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తన అందంతో కుర్రకారుని ఉర్రూతలూగించిన పమేలా... తన వ్యక్తిగత జీవితం ద్వారా కూడా ఎప్పుడూ పతాక శీర్షికల్లో నిలుస్తూ వస్తోంది. ఇప్పటికే ఐదు పెళ్లిళ్లు చేసుకున్న పమేలా తాజాగా సంచలన ప్రకటన చేసింది. తన బాడీగార్డ్ డాన్ హేహర్స్ట్ ను పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది.

కరోనా లాక్ డౌన్ సమయంలో కెనడాలోని తన ఐలాండ్ లో హేహర్స్ట్  ను వివాహం చేసుకున్నట్టు పమేలా వెల్లడించింది. ఇది ఆమెకు ఆరో వివాహం కావడం గమనార్హం. తన భర్త హేహర్స్ట్  తో ఉన్న పెళ్లి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేసింది. సోషల్ మీడియాకు తాను దూరంగా ఉండాలనుకుంటున్నానని... ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను తొలగించబోతున్నట్టు చెప్పింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Pamela Anderson
Marriage
Hollywood
  • Loading...

More Telugu News