Viral Videos: 'నీళ్ల‌లో నిప్పు' అంటూ చ‌ర‌ణ్‌ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ వీడియో పోస్ట్ చేసిన సినీ యూనిట్!

  • అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్
  • ఆయ‌న‌ను నిప్పుగా పేర్కొన్న ఆర్ఆర్ఆర్
  • అల‌రిస్తోన్న షూటింగ్ వీడియో
rrr video relesed

దర్శక దిగ్గ‌జం రాజమౌళి రూపొందిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను ఆ సినిమా యూనిట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. నీళ్లలో నిప్పు అంటూ చెర్రీపై చిత్రీకరిస్తున్న ఓ సన్నివేశానికి సంబంధించిన ఓ షాట్ ను ఆ సినిమా యూనిట్ పంచుకుంది.

అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్ కు సంబంధించిన టీజ‌ర్‌‌ను ఇప్ప‌టికే సినిమా బృందం విడుద‌ల చేసింది. నిప్పు మ‌ధ్యలో ఆయ‌న పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ఉన్న‌ ఆ టీజ‌ర్ అల‌రించింది. మ‌రోవైపు ఈ సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్ టీజ‌ర్ సంద‌ర్భంగా ఆయ‌న‌ నీళ్లలోంచి ఆయుధం తీస్తున్న‌ట్లు చూపించింది. చెర్రీని నిప్పుగా, ఎన్టీఆర్‌ను నీరుగా ఈ సినిమా యూనిట్ పేర్కొంటోన్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

More Telugu News