Gautam Gambhir: ధోనీ ప్రత్యేకత ఇదే: గౌతమ్ గంభీర్

  • ఈ ఐపీఎల్ సీజన్ లో 10 మందిని వదిలించుకోనున్న ఆర్సీబీ
  • కేవలం ఐదు మందిని మాత్రమే పక్కన పెట్టిన సీఎస్కే
  • ఆటగాళ్లపై ధోనీ విశ్వాసముంచాడన్న గంభీర్
Gautam Gambhir praises Dhoni

టీమిండియాను విజయతీరాల్లోకి నడిపించిన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీది ఒక ప్రత్యేకత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కెప్టెన్ కూల్ గా ఉంటూనే తన వ్యూహాలను విజయవంతంగా అమలు చేసి, సత్తా చాటిన ఆటగాడు ధోనీ.

మరోవైపు ధోనీ ఎదుర్కొన్న విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్లను జట్టు నుంచి సాగనంపిన వైనంపై ధోనీ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ధోనీని విమర్శించిన వారిలో మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తొలి వరుసలో ఉంటాడు. ఎన్నోసార్లు ధోనీపై గంభీర్ విరుచుకుపడ్డారు. దాన్ని పక్కన పెడితే... తాజాగా ధోనీపై గంభీర్ ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ 2021 రెటెన్షన్ జాబితాపై స్పందిస్తూ ఆకాశానికెత్తేశారు.

ఈ ఐపీఎల్ సీజన్ కు సంబంధించి పలు జట్లు తమ ఆటగాళ్లను తొలగించుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యధికంగా 10 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. త్వరలో జరగనున్న మినీ వేలంలో ఈ ఫ్రాంఛైజీ వీరిని వదిలించుకోనుంది. గత సీజన్ లో దారుణ ప్రదర్శన చేసిన చెన్నై జట్టు మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. కేవలం ఐదు మంది ఆటగాళ్లను మాత్రమే వదులుకుంది. ఈ అంశంపై గంభీర్ మాట్లాడుతూ, ధోనీ ప్రత్యేకత ఇదేనని చెప్పారు. చెన్నై సూపర్ కింగ్ సక్సెస్ కు ధోనీయే కారణమని కితాబిచ్చారు.

గత ఐపీఓల్ లో సీఎస్కే చెత్తగా ఆడిందని... మొత్తం జట్టును మార్చాల్సిన అవసరం ఉందని ఎందరో అభిప్రాయపడ్డారని గంభీర్ చెప్పారు. కానీ, సీఎస్కే కేవలం ఐదుగురిని మాత్రమే వదిలించుకోవడానికి సిద్ధమైందని అన్నారు. ఆటగాళ్లపై  సీఎస్కే విశ్వాసాన్ని కనబరిచిందని... దీనికి ధోనీయే కారణమని చెప్పారు.

More Telugu News