Deep Siddhu: ప్రస్తుతం దీప్ సిద్ధూ ఎక్కడ?... ఆచూకీని కనుక్కోలేకపోతున్న పోలీసులు!

Where is Deep Siddhu

  • జనవరి 26 నిరసనల్లో ప్రమేయం
  • ఆపై పారిపోయిన దీప్ సిద్ధూ
  • లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు

న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ పై ఎవరూ ఊహించని రీతిలో గణతంత్ర దినోత్సవం నాడు సిక్కుల జెండాను ఎగురవేసిన ఘటనతో పాటు, రైతులను రెచ్చగొట్టారన్న అభియోగాలను ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్ సిద్ధూ ఎక్కడ ఉన్నారన్న విషయమై ప్రస్తుతం పోలీసులు ఎటువంటి క్లూనూ సంపాదించలేదని తెలుస్తోంది. 26 నాటి అల్లర్ల తరువాత, అతనిపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, తొలుత కారులో, ఆపై బైక్ పై కూర్చుని అక్కడి నుంచి దీప్ వెళ్లిపోయినట్టు మాత్రమే తెలుస్తోంది.

రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన నిరసనలను ఫేస్ బుక్ లైవ్ లో దీప్ సిద్ధూ చూపించిన తరువాత, అతనిపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే, తాము జాతీయ పతాకాన్ని తొలగించలేదని, కేవలం సిక్కు మత చిహ్నమైన జెండాను అక్కడ నిలిపామని దీప్ ప్రకటించినా, రైతులు, సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ప్రస్తుతం దీప్ ఎక్కడ ఉన్నారన్న విషయం తెలియరాలేదని, అతనితో పాటు నిరసనల్లో భాగమైన పలువురిపై లుకౌట్ నోటీసులు జారీ చేశామని ఉన్నతాధికారులు తెలిపారు.

Deep Siddhu
New Delhi
Red Fort
Lookout
Notice
Police
  • Loading...

More Telugu News