Vinay Bhaskar: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

  • 2012లో కాజీపేట రైల్వే స్టేషన్‌లో రైల్ రోకో
  • వినయ్ భాస్కర్ సహా 9 మందిపై కేసు
  • విచారణకు హాజరు కాకపోవడంతో వారెంట్లు
Non Bailable Arrest Warrant against TRS MLA Vinay Bhaskar

2012 నాటి కేసులో కోర్టు విచారణకు గైర్హాజరవుతూ వస్తున్న వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనతోపాటు మరో 8 మంది ప్రజాప్రతినిధులకు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2012లో నమోదైన కేసులో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలో వినయ్ భాస్కర్‌ సహా మరికొందరు ప్రజాప్రతినిధులు కాజీపేట రైల్వే స్టేషన్‌లో రైలు రోకో కార్యక్రమం చేపట్టారు. దీంతో అప్పట్లో వీరిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. అయితే, ఈ కేసులో నిందితులుగా ఉన్నవారెవరూ విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు తాజాగా, వారందరికీ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

More Telugu News