Proceedings: ఐఏఎస్ లపై ప్రొసీడింగ్స్ జారీ చేసే అధికారం ఎస్ఈసీకి లేదు... అభిశంసన ఉత్తర్వులు తిప్పి పంపిన సర్కారు

AP Government returns proceedings to SEC
  • పంచాయతీ ఎన్నికలకు సుప్రీం క్లియరెన్స్
  • గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ లపై ఎస్ఈసీ అభిశంసన
  • ప్రొసీడింగ్స్ జారీ
  • వివరణ కోరకుండా ప్రొసీడింగ్స్ ఏంటన్న ప్రభుత్వం
ఏపీలో స్థానిక ఎన్నికల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ లను అభిశంసిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇవే ప్రొసీడింగ్స్ ను ఆయన కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగానికి కూడా పంపారు. అయితే, ఐఏఎస్ అధికారులకు ప్రొసీడింగ్స్ జారీ చేసే అధికారం ఎస్ఈసీకి లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, ఎస్ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను ఆయనకే తిప్పి పంపింది. ముందు వివరణ కోరకుండా ఎలా ప్రొసీడింగ్స్ జారీ చేస్తారని సర్కారు ప్రశ్నించింది.
Proceedings
Andhra Pradesh
YSRCP
SEC

More Telugu News