Facebook: అమ్మకానికి 533 మిలియన్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల నంబర్లు.. అందులో 60 లక్షల మంది భారతీయులు!

Facebook users phone numbers are for sale through Telegram

  • ఫేస్‌బుక్ లోపాన్ని అడ్డం పెట్టుకుని సేకరించిన హ్యాకర్ 
  • 2019లో లోపాన్ని సవరించిన ఫేస్‌బుక్
  • ఒక నంబరుకు 5 డాలర్లు, డేటాకు 5 వేల డాలర్ల ధర నిర్ణయం

‘అండర్ ది బ్రీచ్’ పేరుతో ట్విట్టర్ ఖాతా నిర్వహించే సైబర్ నిపుణుడు అలొన్ గాల్ భారత్‌లోని ఫేస్‌బుక్ వినియోగదారులకు సంబంధించి సంచలన విషయాన్ని వెల్లడించారు. దేశంలోని 60 లక్షల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల ఫోన్ నంబర్లు టెలిగ్రామ్‌లో అమ్మకానికి ఉన్నాయని తెలిపారు. అంతేకాదు, అమ్మకానికి పెట్టిన వ్యక్తి వద్ద ఏకంగా 533 మిలియన్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారం కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో ఉన్న ఓ లోపాన్ని అడ్డం పెట్టుకుని 2019కి కంటే ముందే ఆ వ్యక్తి ఈ నంబర్లు, సమాచారాన్ని సేకరించాడని వివరించారు.  

2019లో ఫేస్‌బుక్ ఆ లోపాన్ని సవరించినప్పటికీ అప్పటికే అతడు ఈ సమాచారం మొత్తాన్ని సేకరించి పెట్టుకున్నాడని అలొన్ తెలిపారు. సోషల్ మీడియా ఖాతాలు, వాటి ఫోన్ నంబర్లతో ఆ హ్యాకర్ ఓ డేటాబేస్‌ను తయారుచేసుకున్నాడని చెప్పారు. వాటినే ఇప్పుడు విక్రయానికి పెట్టాడని వివరించారు. ఒక్కో ఫోన్ నంబరును తెలుసుకోవడానికి 5 డాలర్లు, డేటా గురించి తెలుసుకోవాలంటే 5 వేల డాలర్ల ధరను హ్యాకర్ నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు వీటిని ఆ హ్యాకర్ విక్రయానికి పెట్టాడని అలొన్ గాల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News