Varla Ramaiah: మంత్రి పెద్దిరెడ్డి ఎస్ఈసీని కుట్రదారు అని ప్రస్తావించడం క్రమశిక్షణ రాహిత్యం: వర్ల రామయ్య

Varla Ramaiah slams Peddireddy

  • మంత్రి పెద్దిరెడ్డిపై వర్ల రామయ్య ధ్వజం
  • కాన్స్పిరేటర్ అన్నారని వెల్లడి
  • గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్
  • మంత్రులు నోరు కంట్రోల్ లో ఉంచుకోవాలని హితవు

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కాన్స్పిరేటర్ (కుట్రదారు) అని ప్రస్తావించారని, ఇది క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుందని అన్నారు. ఆయన మంత్రిగా ప్రజాసేవకుడు కాబట్టి గవర్నర్ వెంటనే ఆయనను మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంత్రులందరూ తమ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.

Varla Ramaiah
Peddireddi Ramachandra Reddy
SEC
YSRCP
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News