Padma Awrads: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం... ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్
- 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు
- ఏపీకి చెందిన ముగ్గురికి పద్మశ్రీ
- తెలంగాణకు చెందిన కనకరాజుకు పద్మశ్రీ
- గానగంధర్వుడికి మరణానంతరం పద్మవిభూషణ్
- జపాన్ ప్రధాని షింజో అబేకు విశిష్ట పురస్కారం
విభిన్న రంగాల ప్రతిభావంతులు, తమదైన రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తులకు, సేవా తత్పరత కలిగిన వ్యక్తులకు ఇచ్చే పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. వారిలో ఏపీకి చెందినవారు ముగ్గురున్నారు. అన్నవరపు రామస్వామి (కళలు), నిడుమోలు సుమతి (కళలు), ఆశావాది ప్రకాశ్ రావు (సాహిత్యం) పద్మశ్రీకి ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి కనకరాజు కళల విభాగంలో పద్మశ్రీ అందుకోనున్నారు.
ఇక, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించారు. ఈసారి జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు పద్మవిభూషణ్ ప్రకటించడం విశేషం అని చెప్పాలి. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లో నరీందర్ సింగ్ కపానీ (అమెరికా), వైద్యరంగంలో బెల్లె మోనప్ప హెగ్డే, ఆధ్యాత్మిక రంగంలో మౌలానా వహీదుద్దీన్ ఖాన్ పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
పీఎంఓ మాజీ కార్యదర్శి నృపేంద్ర మిశ్రాకు పద్మభూషణ్ అందించనున్నారు. సుదర్శన్ సాహు (కళలు), బి.బి.లాల్ (ఆర్కియాలజీ), రామ్ విలాస్ పాశ్వాన్, తరుణ్ గొగోయ్, సుమిత్రా మహాజన్, కేశూభాయ్ పటేల్ లకు పద్మభూషణ్ ప్రకటించారు.