Avika Gor: చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ సరసన అవికా గోర్

Avika Gor opposite Kalyan Dev

  • 'ఉయ్యాల జంపాల'తో టాలీవుడ్ కి అవిక 
  • అవకాశాలు తగ్గడంతో దూరమైన ముద్దుగుమ్మ
  • తాజాగా మళ్లీ టాలీవుడ్ పై దృష్టిపెట్టిన అవిక
  • శ్రీధర్ సీపాన దర్శకత్వంలో అవకాశం 

'ఉయ్యాల జంపాల' సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన అవికా గోర్.. అప్పటికే బుల్లితెర సీరియల్ 'చిన్నారి పెళ్లికూతురు'తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. తొలిసినిమా హిట్టవ్వడంతో పలు ఆఫర్లు ఆమెకు వచ్చాయి. దీంతో 'సినిమా చూపిస్త మావా', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో ఒక్కసారిగా ఇక్కడ మాయమైంది.

ఇటీవల మళ్లీ టాలీవుడ్ పై దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ మునుపటి ఇమేజ్ ను చెరిపేసుకునేలా మోడ్రన్ స్టయిల్ లో ఫొటో షూట్స్ కూడా చేసింది. దీంతో ఇప్పుడు మళ్లీ అవికాకు అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సరసన ఓ చిత్రంలో చేస్తోంది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా తనే వెల్లడించింది. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో అవికా గోర్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న ఈ చిత్రం షూటింగులో ఈ చిన్నది పాల్గొంటోంది.

Avika Gor
Kalyan Dev
Sridhar Seepana
  • Error fetching data: Network response was not ok

More Telugu News