Joe Biden: 'లింగ వివక్ష లేదు.. మనుషులంతా ఒక్కటే' అంటూ బైడెన్ ఆర్డర్... క్రమంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!

Gender Discrimination of Biden Goes Contraversy

  • అందరూ సమానమేనంటూ సంతకం
  • ఆటల్లో ట్రాన్స్ ఉమన్ పాల్గొంటే తమ పరిస్థితి ఏంటంటున్న మహిళలు
  • తిక్క నిర్ణయమంటున్న పలువురు

ఆడవాళ్లయినా, మగవాళ్లయినా, లింగ మార్పిడి చేయించుకున్న వారైనా, అందరూ సమానమేనని, అందరూ మనుషులేనని, వారిలో ఎటువంటి తేడా లేదని చెబుతూ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన సంతకంపై తొలుత అభినందనలు వచ్చినా, ఇప్పుడు క్రమంగా అసహనం, నిరసనలు పెరుగుతున్నాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఇంతవరకూ 17 సంతకాలు పెట్టగా, వాటిల్లో స్త్రీ, పురుషులు, ట్రాన్స్ జెండర్లు సమానమేనని, ఎవరిపైనా వివక్ష చూపించరాదన్న బిల్లుపై సంతకం చేశారు.

అంతవరకూ బాగానే ఉంది. బైడెన్ తీసుకున్న నిర్ణయానికి తొలుత అభినందనలే వచ్చాయి. ఆపై మాత్రం పరిస్థితి మారింది. ఇప్పుడు పలువురు ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఉమన్ రన్నర్ ను ట్రాన్స్ ఉమన్ రన్నర్ తో పోటీకి దింపితే గెలిచేది ట్రాన్స్ ఉమన్ మాత్రమేనని, వారు బలంగా ఉంటారని, ఇటువంటి నిర్ణయం తిక్క నిర్ణయామని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

వాస్తవానికి ఈ ఆర్డర్ గత బుధవారం నాడు పాస్ అయింది. బైడెన్ ఎంతో మంచి అధ్యక్షుడంటూ ట్రాన్స్ జెండర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన సమ భావనకు ఎవరూ అడ్డు చెప్పడం లేదుకానీ, మహిళల క్రీడల్లో ట్రాన్స్ జెండర్ మహిళలను అనుమతించరాదని, వారు బరిలో ఉంటే, తమకు గుర్తింపు దక్కదని, తామే ఓడిపోతామని మహిళల నుంచి బైడెన్ పై ఒత్తిడి పెరుగుతోంది. మహిళల వ్యతిరేకతకు రిపబ్లికన్ల నుంచి మద్దతు లభిస్తోంది. ఇక ఈ విషయంలో బైడెన్ తన తదుపరి అడుగులను ఎటువైపు వేస్తారో వేచి చూడాలి.

Joe Biden
Signature
Transgender
Ladies
Gents
  • Loading...

More Telugu News