CPI Narayana: పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ నడుపుతున్నప్పుడు షర్మిల పార్టీ పెడితే తప్పేముంది?: సీపీఐ నారాయణ

  • షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారంటూ మీడియా కథనాలు
  • స్పందించిన సీపీఐ నారాయణ
  • షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తే సీపీఐ వైఖరి తెలియజేస్తామని వెల్లడి
  • జగన్ అసమర్థత వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న నారాయణ
CPI Narayana comments on Sharmila party issue

సీపీఐ అగ్రనేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేయడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్తగా పార్టీ స్థాపించబోతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ నడుపుతున్నప్పుడు షర్మిల కొత్త పార్టీ పెట్టడంలో తప్పేముందని అన్నారు. షర్మిల కొత్త పార్టీ పెట్టినప్పుడు సీపీఐ వైఖరి తెలియజేస్తామని వెల్లడించారు. అయితే జగన్ అసమర్థత వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చాయని, దీన్ని బట్టి జగన్ రచ్చ గెలిచినా ఇంట గెలవలేడన్న విషయం నిరూపితమవుతోందని అభిప్రాయపడ్డారు.

More Telugu News