Munnah: యాంకర్ ప్రదీప్ సినిమా ఈవెంట్ లో అపశ్రుతి... వేదికపై కళ్లు తిరిగి పడిపోయిన దర్శకుడు

Anchor Pradeep new movie director collapsed on stage

  • యాంకర్ ప్రదీప్ హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రం
  • లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన విడుదల
  • ఎట్టకేలకు జనవరి 29న విడుదలకు రంగం సిద్ధం
  • హైదరాబాదులో ప్రెస్ మీట్
  • పని ఒత్తిడితో కుప్పకూలిన దర్శకుడు

ప్రముఖ బుల్లితెర యాంకర్, సినీ నటుడు ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లుగా విడుదల కాని ఈ చిత్రం జనవరి 29న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని చిత్రబృందం హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

అయితే హీరో ప్రదీప్ మాట్లాడుతున్న సమయంలో వేదికపైనే ఉన్న చిత్ర దర్శకుడు మున్నా ఒక్కసారిగా తూలి పడిపోయారు. కళ్లు తిరగడంతో కుప్పకూలారు. దాంతో ప్రెస్ మీట్ లో కలకలం రేగింది. ప్రథమ చికిత్స అనంతరం మున్నా కోలుకున్నారు. దాంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. సినిమా రిలీజ్ నేపథ్యంలో ఊపిరి తిప్పుకోని షెడ్యూల్ కారణంగానే ఒత్తిడికి గురై మున్నా కళ్లు తిరిగి పడిపోయినట్టు భావిస్తున్నారు.

కాగా, ఈ చిత్రంలోని నీలినీలి ఆకాశం అనే పాట ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రదీప్, అమృతా అయ్యర్ జంటగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మున్నా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News