pietersen: ద్ర‌విడ్ నాకు చేసిన సూచ‌న‌లను ఇంగ్లాండ్ జ‌ట్టు పాటించాలి: పీట‌ర్స‌న్

  • శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఇంగ్లాండ్
  • స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక‌పోతోన్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్
  • గ‌తంలో పీట‌ర్స‌న్‌కు ద్ర‌విడ్ సూచ‌న‌లు
  • వాటిని పోస్ట్ చేసిన పీట‌ర్స‌న్‌
pietersen gives suggestions to england team

శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఇంగ్లాండ్ క్రికెట్‌ జట్టు రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతోంది. అయితే,
శ్రీలంక ఆట‌గాళ్ల‌ స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతోంది. ఈ నేప‌థ్యంలో ఇంగ్లాండ్‌ ఓపెనర్లకు ఆ జట్టు మాజీ క్రికెట‌ర్ కెవిన్‌ పీటర్సన్ ఓ సలహా ఇచ్చాడు. గ‌తంలో తాను కూడా క్రికెట్‌ ఆడే స‌మ‌యంలో ఇలాంటి ఇబ్బంది పడ్డాన‌ని, అప్పుడు టీమిండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్ ఇచ్చిన ఓ స‌ల‌హాతో రాణించాన‌ని తెలిపాడు.

శ్రీలంక‌ స్పిన్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశాడు. అప్ప‌ట్లో రాహుల్‌ ద్రవిడ్‌ తనకు పంపిన ఈ-మెయిల్‌ను  ఇంగ్లాండ్ ఓపెన‌ర్లు చదవాలని ఆయ‌న తెలిపాడు. అప్ప‌ట్లో ద్ర‌విడ్ పంపిన ఆ ఈ-మెయిల్ లోని స‌ల‌హాలు తన ఆటను పూర్తిగా మార్చేశాయ‌ని చెప్పాడు.  

ద్రవిడ్‌ పంపిన ఈ రెండు పేజీల లేఖను తమ‌ క్రికెట్‌ బోర్డు ప్రింట్ తీయాల‌ని, వాటిని క్రాలీ, సిబ్లీకి అందజేయాలని ఆయ‌న విన్నవించాడు. ఇంకా సందేహాలు ఉంటే దీనిపై చ‌ర్చించేందుకు  తనకు ఫోన్‌‌ చేయొచ్చని అన్నాడు. ఇలా చేస్తే తమ‌ ఓపెనర్లు శ్రీలంక‌ స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలరని తెలిపాడు.

కాగా,  2010లో బంగ్లాదేశ్‌తో ఇంగ్లాండ్ సిరీస్ ఆడింది. అప్ప‌ట్లో టెస్టు సిరీస్‌లో పీటర్సన్‌ స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు ప‌డ్డాడు. దీంతో అత‌డికి ద్రవిడ్ ఈ రెండు పేజీల మెయిల్ ను పంపి సూచ‌న‌లు చేశాడు. అందులో ఉన్న సూచ‌న‌ల సాయంతో ఆయ‌న రాణించాడు.

More Telugu News