Hyderabad: హైదరాబాద్ రేషన్ పంపిణీలో సమూల మార్పులు

  • ఫోన్ ఓటీపీ ద్వారానే రేషన్ పంపిణీ
  • ప్రతి ఒక్కరూ ఆధార్ కు ఫోన్ నంబర్ లింక్ చేసుకోవాలి
  • అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడుతుందన్న చీఫ్ రేషన్ ఆఫీసర్
Changes for supply of ration in Hyderabad

హైదరాబాద్ రేషన్ వ్యవస్థలో అక్రమాలను అడ్డుకోవడానికి సమూల మార్పులను తీసుకొస్తున్నారు. ఇకపై హైదరాబాద్ జిల్లాలో కేవలం ఫోన్ ఓటీపీ ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ జరుగుతుందని చీఫ్ రేషన్ ఆఫీసర్ ప్రకటించారు. సివిల్ సప్లైస్ కమిషనర్ ఆదేశాల మేరకు వచ్చే నెల 1 నుంచి ఐరిస్ లేదా ఓటీపీ ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. కరోనా వైరస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వేలిముద్రను తీసుకోవడం తాత్కాలికంగా ఆపేశామని వెల్లడించారు.

ఆధార్ కార్డును ఫోన్ నంబర్ కు అనుసంధానం చేసుకోవాలని చీఫ్ రేషన్ ఆఫీసర్ చెప్పారు. ఆధార్ కు ఫోన్ నంబర్ అనుసంధానం లేకపోతే రేషన్ ను సరఫరా చేయలేమని తెలిపారు. రేషన్ తీసుకునే సమయంలో ఫోన్ కు ఓటీపీ వస్తుందని... దాన్ని బయోమెట్రిక్ యంత్రంలో నమోదు చేసిన వెంటనే సరుకులను డీలర్లు ఇస్తారని చెప్పారు. ఈ పద్ధతి వల్ల అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. ఈ నెల 31 లోగా రేషన్ కార్డు ఉన్నవాళ్లంతా తమ ఫోన్ నంబర్ ను ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాలని సూచించారు.

More Telugu News