Varla Ramaiah: విజయసాయిరెడ్డి కారుపై వాటర్ బాటిల్ పడితే అది ఏ రకంగా ఆయనపై హత్యాయత్నం అయింది?: వర్ల రామయ్య

Varla Ramaiah questions AP DGP Gautam Sawang

  • రామతీర్థంలో విజయసాయిరెడ్డి వాహనంపై దాడి
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నెల్లిమర్ల పోలీసులు
  • చంద్రబాబును ఏ1గా పేర్కొన్న వైనం
  • గతంలో ఇదే విధంగా చంద్రబాబు వాహనంపై దాడి జరిగిందన్న వర్ల
  • అప్పుడు 'స్వేచ్ఛ' అన్నారంటూ వ్యాఖ్యలు

రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై జరిగిన దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నెల్లిమర్ల పోలీసులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు.

"చంద్రబాబు వాహనంపై రాళ్లు, చెప్పులు, కర్రలతో దాడి చేస్తే అది రాజ్యాంగం ప్రజలకిచ్చిన స్వేచ్ఛ అని సెలవిచ్చారు... వారిపై ఏ చర్యలు తీసుకోలేదు. మరి ఏ2 విజయసాయిరెడ్డి కారుపై వాటర్ బాటిల్ పడితే ఏ రకంగా ఆయనపై హత్యాయత్నం అయింది?" అంటూ నిలదీశారు. ఈ చిక్కుముడి విప్పి ప్రజలకు చెప్పండి అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

కాగా, నెల్లిమర్ల పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబును ఏ1గా, అచ్చెన్నాయుడిని ఏ2గా, కళా వెంకటరావును ఏ3గా పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లదాడికి చంద్రబాబే సూత్రధారి అని పేర్కొన్నారు.

Varla Ramaiah
AP DGP
Chandrababu
Vijay Sai Reddy
Ramatheertham
  • Loading...

More Telugu News