CPI Ramakrishna: కరోనా సమయంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా జరిగాయి: రామకృష్ణ

  • కరోనా సాకు చూపి ఎన్నికలు ఆపాలనుకోవడం సరికాదు
  • బీజేపీతో పొత్తు నుంచి పవన్ కల్యాణ్ బయటకు రావాలి
  • ఉద్యోగ సంఘాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
US President elections also conducted during Covid time says CPI Ramakrishna

బీజేపీతో దేశానికి పెద్ద ముప్పు ఉందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నర పాటు ఆపేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఇచ్చిందని... ఉరిశిక్ష వేసి ఏడాదిన్నరపాటు ఆపడానికి, దీనికి మధ్య తేడా లేదని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లౌకికవాది అని, బీజేపీతో పొత్తు నుంచి ఆయన బయటకు రావాలని సూచించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాకుండా చిత్తుగా ఓడించాలని ఓటర్లను కోరారు.

కరోనా సాకు చూపి పంచాయతీ ఎన్నికలను ఆపాలనుకోవడం ముఖ్యమంత్రి జగన్ కు తగదని రామకృష్ణ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా కరోనా సమయంలోనే జరిగాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎన్నికల విధులను నిర్వహించలేమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పారు. గతంలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

More Telugu News