Andhra Pradesh: ఏపీలో నేడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్.. సమయం కావాలన్న ప్రభుత్వం

  • ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్
  • తొలి విడతలో 11 జిల్లాల్లోని ఒక్కో డివిజన్‌లో ఎన్నికలు
  • గుంటూరు, చిత్తూరు జిల్లాలకు మినహాయింపు
AP Panchayat elections notification today

ఆంధ్రప్రదేశ్‌లో నేడు పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిన్న తెలిపారు. తొలి విడతలో 11 జిల్లాలకు సంబంధించి ఒక్కో డివిజన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విడతలో గుంటూరు, చిత్తూరు జిల్లాలను మినహాయించారు.

అంతకుముందు నిన్న రాష్ట్రంలో హైడ్రామా నడిచింది. ఓ వైపు వ్యాక్సినేషన్, మరోవైపు ఎన్నికలు సాధ్యం కావని, కాబట్టి నోటిఫికేషన్ వాయిదా వేయాలని ప్రభుత్వం కోరింది. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణకే రమేశ్ కుమార్ మొగ్గు చూపుతున్నారు. గత మార్చిలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అక్రమాలను, హింసను నివారించడంలో విఫలమయ్యారన్న కారణంతో 9 మంది అధికారులను నిమ్మగడ్డ విధుల నుంచి తప్పించారు.

నోటిఫికేషన్ విడుదల కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లకు నిమ్మగడ్డ లేఖలు రాశారు. అయితే, నిమ్మగడ్డ లేఖను వారు పట్టించుకోలేదు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీ, పోలీసు అధికారులు, సంబంధిత అధికారులతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

More Telugu News