Andhra Pradesh: 10వ తరగతి పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ విద్యాశాఖ మంత్రి

  • ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలను తప్పకుండా నిర్వహిస్తాం
  • మే నెలలో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం
  • వారం రోజుల్లో పరీక్షల హెడ్యూల్ ని విడుదల చేస్తాం
AP govt gives clarity on 10th class exams

కరోనా వైరస్ గత ఏడాది అన్ని పరీక్షలపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి కూడా పరీక్షలను నిర్వహిస్తారా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది. ఈ అనుమానాలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పూర్తి స్పష్టతను ఇచ్చారు.

ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు తప్పనిసరిగా జరుగుతాయని ఆయన తెలిపారు. మే నెలలో పరీక్షలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. మరో వారం రోజుల్లో పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. పరీక్షను 11 పేపర్లతో నిర్వహించాలా? లేక 6 పేపర్లతోనా? అనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

More Telugu News