Lalu Prasad Yadav: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం

Lalu Prasad Yadav hospitalised

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న లాలూ
  • రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స
  • లాలూకి కోవిడ్ టెస్టుల్లో నెగెటివ్

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటికే చికిత్స తీసుకుంటున్న ఆయన... ప్రస్తుతం ఊపిరి తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లాలూకి ఇన్ఫెక్షన్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఆయనకు చికిత్స అందిస్తున్నామని... ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

లాలూకు కరోనా పరీక్షలను కూడా నిర్వహించామని... నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. అవినీతి కేసుల్లో ఆయన జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆయన ఆరోగ్యం పలుమార్లు క్షీణించింది. దీంతో, ఆయన బెయిల్ కోసం కోర్టులో పిటిషన్లు కూడా వేశారు. కానీ, కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.

Lalu Prasad Yadav
RJD
Illness
  • Loading...

More Telugu News