Jagan: జెండా ఊపి రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన జగన్

jagan launches door delivery vehicles

  • 2,500 డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం  
  • మిగ‌తా వాహ‌నాలను ప్రారంభించ‌నున్న మంత్రులు
  • ఈ రోజు మొత్తం 9,260 వాహనాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలు ప్రారంభ‌మ‌య్యాయి. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ ఈ వాహ‌నాల‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఏపీలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలు సేవ‌లందిస్తాయి. ఇవ‌న్నీ జ‌గ‌న్ చేతుల మీదుగా ప్రారంభ‌మ‌య్యాయి. ఏపీలోని మిగ‌తా జిల్లాల్లో ఆ వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు. ఈ రోజు మొత్తం 9,260 వాహనాలు ప్రారంభం అవుతున్నాయి.

రేషన్‌ సరుకుల కోసం ల‌బ్ధిదారులు  ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను గ‌తంలో పాదయాత్ర సమయంలో జ‌గ‌న్ గుర్తించారు. రేష‌న్ షాపు వ‌ర‌కు వెళ్లి వృద్ధులు, రోగులు సరుకులు తెచ్చుకోలేక‌పోతోన్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. అప్ప‌ట్లో ఇచ్చిన‌ హామీ మేరకు జ‌గ‌న్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో వ‌చ్చేనెల‌ 1 నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం ఈ వాహ‌నాలు ప‌నిచేయ‌నున్నాయి.

  • Loading...

More Telugu News