Varla Ramaiah: కళా వెంకట్రావును అరెస్ట్ చేసిన‌ తీరు మీ నాయకత్వానికి మచ్చ: వ‌ర్ల రామ‌య్య‌

varla ramaiah slams dgp

  • మనరాష్ట్ర పోలీసు వ్యవస్థకు మంచి పేరుంది
  • డీజీపీ సవాంగ్ గారి నాయకత్వంలో మసక బారుతుంది
  • సింహావలోకనం చేసుకోండి

టీడీపీ సీనియర్ నేత క‌ళా వెంకట్రావును విజయనగరం జిల్లా పోలీసులు అరెస్టు చేసి, ఆ తర్వాత కాసేపటికి విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. పోలీసుల చర్యను టీడీపీ నేత‌లు ఖండిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య స్పందిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

'డీజీపీ సవాంగ్ గారూ! ఎంతో మంచి పేరున్న మనరాష్ట్ర పోలీసు వ్యవస్థ ప్రాభవం, మీ నాయకత్వంలో మసక బారుతుంది. సింహావలోకనం చేసుకోండి. లేకపోతే, స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో, రాత్రి మాజీ హోం మంత్రి కళా వెంకట్రావును అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తీరు, మీ నాయకత్వానికి తీరని మచ్చ'  అని వ‌ర్ల రామ‌య్య విమ‌ర్శ‌లు గుప్పించారు.

Varla Ramaiah
Telugudesam
AP DGP
  • Loading...

More Telugu News