CWC: ఎల్లుండి సీడబ్ల్యూసీ సమావేశం.. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక తేదీపై నిర్ణయం!

  • వర్చువల్ విధానంలో జరగనున్న సమావేశం
  • తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చ
  • బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్వహించడంపై ప్రాధాన్యం
congress decided to meet CWC on 22nd

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని ఈ నెల 22న నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. అదే రోజున కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉంది. అలాగే, తాజా రాజకీయ పరిణామాలతోపాటు పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఈ సమావేశంలో నిర్ణయించవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరగనుంది.

పార్లమెంటు సమావేశాలు జరగడానికి వారం రోజుల ముందు ఈ సమావేశం జరగనుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే, పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపైనా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై రైతులు చేపట్టిన ఆందోళనపైనా చర్చించనున్నారు.

More Telugu News