Assam: బీజేపీని ఇంటికి పంపడమే కాంగ్రెస్ లక్ష్యం.. అసోంలో ఐదు పార్టీలతో కలిసి ‘మహా కూటమి’ ఏర్పాటు

  • ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు
  • అసోం ప్రజల సంక్షేమం కోసమే జట్టు కట్టామన్న నేతలు
  • బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిసి రావాలని పిలుపు
Congress plans to fight in assam assembly polls with another five parties

దేశంలో ప్రబల శక్తిగా మారిన బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమైంది. త్వరలో అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు బరుద్దీన్ అజ్మల్ సారథ్యంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) సహా ఐదు పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ కూటమిలో మూడు లెఫ్ట్ పార్టీలు కూడా ఉన్నాయి.  

నిన్న గువాహటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ నేతలు.. బీజేపీని గద్దె దింపేందుకు మహా కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అసోం ఎన్నికల్లో మొత్తం ఆరు పార్టీలు.. కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్, సీపీఐ, సీపీఎం, అంచలిక్ గణ మోర్చా, సీపీఐ ఎంఎల్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్టు నేతలు ప్రకటించారు. అసోం ప్రజల సంక్షేమం కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అంతేకాదు, బీజేపీ వ్యతిరేక పార్టీలు తమతో జట్టు కట్టాలని కోరారు. కాగా, ఈ ఏడాది పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

More Telugu News