Vaccine: 'ఇంట్లోనే కరోనా టీకా తయారీ ఎలా?': గూగుల్ లో భారతీయుల అత్యధిక సెర్చ్ ఇదే!

  • ఇండియాలో 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్
  • టీకా తయారీ గురించి వెతుకుతున్న భారతీయులు
  • గతంలోనూ టీకా తయారీపై సెర్చింగ్
Indians Search Who to Make Corona Vaccine in Home

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఇండియాలో ఈ నెల 16న ప్రారంభమైంది. గత సంవత్సరం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రారంభమైన ఈ మహాయజ్ఞంలో భాగంగా న్యూఢిల్లీ ఎయిమ్స్ లోని పారిశుద్ధ్య కార్మికుడు మనీష్ కుమార్ కు తొలి టీకాను ఇవ్వగా, గత మూడు రోజుల్లో దాదాపు 4 లక్షల మందికి టీకాను ఇచ్చారు.

 ఇక, ఈ వైరస్ ను అడ్డుకునే వ్యాక్సిన్ తయారీ గురించి, అందునా టీకాను ఇంట్లోనే తయారు చేసుకునే విధానం గురించి వెతికేందుకు ఇండియన్స్ గూగుల్ సెర్చ్ ని ఆశ్రయిస్తున్నారు.

గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, "ఇంట్లోనే వ్యాక్సిన్ తయారీ ఎలా?" అన్న సెర్చ్ వర్డ్స్ టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఆది, సోమవారాల్లో దీని గురించి అత్యధికులు గూగుల్ ను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక దీనికి సమాధానంగా "లేదు... మీరు ఇంట్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ ను తయారు చేయలేరు" అన్న సమాధానం కనిపిస్తోంది.

గూగుల్ ను ఆశ్రయించి టీకా తయారీ గురించి వాకబు చేయడం ఇదే తొలిసారేమీ కాదు. గత సంవత్సరం జూలైలో సైతం టీకా తయారీ గురించిన సమాచారం టాప్ ట్రెండింగ్ లో ఉంది.

More Telugu News