Krishna District: గుడివాడ టూటౌన్ ఎస్సై ఆత్మహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

Gudivada SI Suicide by Hanging

  • తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య
  • మూడు నెలల క్రితమే వివాహం
  • మరోపక్క బ్యూటీషియన్‌తో సహజీవనం 

కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్సై పిల్లి విజయ్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఫ్లాట్‌లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. మూడు నెలల క్రితమే ఆయనకు వివాహమైంది. అయితే, భార్యను కాపురానికి తీసుకురాకుండా గుడివాడలో ఓ బ్యూటీషియన్‌తో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది.

హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమె పరిచయం కావడంతో అప్పటి నుంచి ఆమెతోనే ఉంటున్నట్టు చెబుతున్నారు. విజయ్‌కుమార్ గతంలో సస్పెండయ్యారు కూడా. కాగా, ఆయన ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Krishna District
Gudivada
SI
Suicide
  • Loading...

More Telugu News