RGV: 'ఇది మహాభారతం కాదు'... వర్మ కొత్త వెబ్ సిరీస్

RGV announced new web series and released audio poster

  • ఆనంద్ చంద్ర దర్శకత్వంలో వర్మ వెబ్ సిరీస్
  • సిరాశ్రీ రచన
  • ఆడియో పోస్టర్ రిలీజ్ చేసిన వర్మ
  • తెలంగాణలోని ఓ పట్టణం అంటూ ఆసక్తి రేపిన వైనం

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏంచేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. తాజాగా ఆయన 'ఇది మహాభారతం కాదు' అనే టైటిల్ తో వెబ్ సిరీస్ ప్రకటించారు. దీనికి రచన సిరాశ్రీ కాగా, ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఓవరాల్ పర్యవేక్షణ వర్మ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, దీనికి సంబంధించిన ఆడియో పోస్టర్ ను వర్మ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు.

మహాభారతంలో కనిపించే పాత్రలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తారసపడుతుంటాయని, తెలంగాణలోని ఓ పట్టణంలోనూ అలాంటి వ్యక్తులు ఉన్నారని, దీని ఆధారంగా తాము వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నామని వర్మ ఆ ఆడియో పోస్టర్ లో వెల్లడించారు. అయితే 'ఇది మహాభారతం కాదు' అని నొక్కి మరీ చెప్పారు. అంతేకాదు, అందులో వినిపించే గొంతుక తనది కాదని, మహాభారతం సమయంలో భగవద్గీత వినిపించిన వ్యక్తే తన గొంతుకను అనుకరించాడని వర్మ వ్యాఖ్యానించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News