Australia: బ్రిస్బేన్ టెస్టులో పటిష్ఠ స్థితిలో ఆస్ట్రేలియా!

  • తొలి ఇన్నింగ్స్ లో 33 పరుగుల లీడ్
  • నిదానంగా స్కోరు పెంచుకుంటున్న ఆసీస్
  • ప్రస్తుతం 206 పరుగుల లీడ్
Australia Going Strona in Brisbane Test

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆస్ట్రేలియా పటిష్ఠ స్థితికి చేరింది. తొలి ఇన్నింగ్స్ లో 33 పరుగుల లీడ్ ను సంపాదించిన తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జట్టులో ఓపెనర్లు మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్ లు రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 89 పరుగులు జోడించిన తరువాత మార్కస్ హారిస్ అవుట్ కాగా, ఆపై 91 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ పెవీలియన్ కు చేరాడు.

ఆ తరువాత జట్టు స్కోరు 123 పరుగుల వద్ద మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో మార్నస్ లబుషేన్, మ్యాథ్యూ వేడ్ లు అవుట్ కావడంతో, భారత జట్టు ఆశలు పెరిగాయి. అయితే, అప్పటికే క్రీజులో ఉన్న స్టీవ్ స్మిత్ కు కామెరాన్ గ్రీన్ తోడై జట్టు స్కోరును నిదానంగా ముందుకు నడిపించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు కాగా, స్మిత్ 42, గ్రీన్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా 206 పరుగుల లీడ్ లో ఉంది.

More Telugu News