Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళాలు
- అయోధ్యలో రామమందిరం నిర్మాణం
- జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ
- దేశవ్యాప్తంగా విరాళాల వెల్లువ
- పూర్తి వివరాలు రావాల్సి ఉందన్న ట్రస్టు ప్రధాన కార్యదర్శి
అయోధ్య లో రాముడి మందిరం నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు విరాళాలు సేకరించనున్నారు. దీనిపై శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పందించారు. ఇప్పటివరకు రూ.100 కోట్ల మేర విరాళాలు వచ్చాయని వెల్లడించారు. అయితే, ఈ విరాళాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రధాన కార్యాలయానికి అందాల్సి ఉందని, కార్యకర్తల నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఈ పవిత్ర కార్యానికి వంద కోట్ల రూపాయలు సమకూరినట్టు వివరించారు.
రామజన్మభూమి వివాదంపై చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు.... రామమందిరం నిర్మాణం కోసం ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏర్పడిందే శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. అయోధ్యలో రామమందిరం నిర్మాణ కార్యకలాపాలను ఈ ట్రస్టు పర్యవేక్షిస్తుంది.