India: తొలి ఇన్నింగ్సులో 33 ప‌రుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా

 Australia led by 33 runs in the first innings
  • తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 336 ప‌రుగుల‌కు ఆలౌట్
  • వాషింగ్ట‌న్ సుంద‌ర్ 62, శార్దూల్ ఠాకూర్ 67 ప‌రుగులు
  • తొలి ఇన్నింగ్సు లో ఆస్ట్రేలియా 369 ప‌రుగులు
  • ఆసీస్ బౌలర్లలో జోష్  కు ఐదు వికెట్లు
భార‌త్-ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 336 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్సు లో ఆస్ట్రేలియా 369 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 33 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌న‌బ‌ర్చింది.

తొలి ఇన్నింగ్సులో టీమిండియాలో రోహిత్ శర్మ 44, శుభమన్ గిల్ 7, ఛటేశ్వర్ పుజారా 25, అజింక్యా రహానే 37, మయాంక్ అగర్వాల్ 38, పంత్ 23, వాషింగ్ట‌న్ సుంద‌ర్ 62, శార్దూల్ ఠాకూర్ 67, సైనీ 5, సిరాజ్ 13, న‌ట‌రాజ‌న్ 1 (నాటౌట్) ప‌రుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో 14 ప‌రుగులు వ‌చ్చాయి.  ఆసీస్ బౌలర్లలో జోష్  కు ఐదు, స్టార్క్, కమిన్స్, స్టార్ కు రెండేసి, లైయ‌న్ కు ఓ వికెట్ ద‌క్కాయి.


India
Australia
Team India
Cricket

More Telugu News