Germany: జర్మనీలో మెర్కెల్​ శకం ఇక ముగిసినట్టే!

  • క్రిస్టియన్ డెమొక్రాట్స్ యూనియన్ కు కొత్త నేత
  • ఆన్ లైన్ సభ ద్వారా ఎన్నుకోనున్న 1,001 మంది
  • పోటీలో ముగ్గురు సీడీయూ నేతలు
  • బవేరియా క్రిస్టియన్ సోషలిస్ట్ యూనియన్ నేత మార్కస్ సోయ్డెర్ కు ప్రజల మద్దతు
End of Merkel era begins as German CDU picks new party leader

2005 నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం ఏకచ్ఛత్రాధిపత్యంగా సాగింది. ప్రజల మెప్పును పొంది మంచి నేత అనిపించుకుంది. ఇక, ఆమె శకం ముగియనుంది. జర్మనీ చాన్స్ లర్ గా ఏంజెలా మెర్కెల్ స్థానాన్ని వేరొకరు భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి మెర్కెల్ తప్పుకోనున్నారు. ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఇప్పటికే ఆమె ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆమె నేతృత్వం వహిస్తున్న క్రిస్టియన్ డెమొక్రట్స్ యూనియన్ (సీడీయూ)కు కొత్త అధిపతిని ఎన్నుకునే పనిలో పడ్డారు. శనివారమే (జనవరి 16) ఆ కార్యక్రమం జరుగనుంది. 1,001 మంది ఆన్ లైన్ సభ ద్వారా సీడీయూ కొత్త నేతను ఎన్నుకోనున్నారు.

వాస్తవానికి సీడీయూ సిస్టర్ పార్టీ అయిన బవేరియాకు చెందిన క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్ యూ) నుంచి చాన్స్ లర్ అభ్యర్థిని  ఎన్నుకుంటూ ఉంటారు. అయితే, ఈ సారి సీడీయూ నేతగా ఆ పార్టీకే చెందిన ఆర్మిన్ లాషెట్, ఫ్రెడ్రిక్ మెర్జ్, విదేశాంగ విధాన నిపుణుడు నార్బర్ట్ రోటెన్ పోటీలో నిలిచారు. అయితే, ప్రజలు మాత్రం సీఎస్ యూ నేత అయిన మార్కస్ సోయ్డెర్ కావాలంటున్నారు. సీడీయూ ప్రజాప్రతినిధులు మాత్రం ఆరోగ్య శాఖ మంత్రి జెన్స్ స్పాన్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆయనేమో లాషెట్ పేరును ప్రతిపాదించారు.

తనను సీడీయూ నేతగా ఎన్నుకుంటే బవేరియా అధినేతగా ఉన్న సోయ్డెర్ కు చాన్స్ లర్ గా మద్దతిస్తానని రోటెన్ చెప్పారు. అయితే, సోయ్డెర్ మాత్రం బవేరియానే తన సొంత దేశమంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు.

More Telugu News