Sonu Sood: సెట్స్ పై టైలర్ లా మారి దుస్తులు కుట్టిన సోనూ సూద్... వీడియో ఇదిగో!

Sonu Sood tailoring on shooting spot in Hyderabad

  • హైదరాబాదులో షూటింగ్ కు విచ్చేసిన సోనూ సూద్
  • కుట్టు మిషన్ తొక్కుతూ దర్శనమిచ్చిన వైనం
  • దర్జీ సూచనలు పాటిస్తూ టైలరింగ్
  • సందడి చేస్తున్న వీడియో

పాన్ ఇండియా నటుడు సోనూ సూద్ ఇప్పుడు ఏంచేసినా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా, సోనూ సూద్ ఓ చిత్రం సెట్స్ పై టైలర్ అవతారం ఎత్తారు. అక్కడే ఉన్న కుట్టు మిషన్ పై దుస్తులు కుట్టారు. పక్కనే దర్జీ సూచనలు ఇస్తుండగా ఆయన కాసేపు టైలరింగ్ చేశారు.

హైదరాబాదులో ఓ సినిమా షూటింగ్ కు హాజరైన సందర్భంగా సోనూ సూద్ కుట్టు మిషన్ తొక్కుతూ దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ దాతృత్వం అంతాఇంతా కాదు. వలసజీవుల పాలిట ఆయన దేవుడే అయ్యారు. ఆ తర్వాత కూడా అడిగినవాళ్లకు కాదనకుండా సాయం చేస్తూ తనది విశాల హృదయం అని చాటుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News