దేశంలో తొలి వ్యాక్సిన్ వేయించుకుంది ఈయనే.. వీడియో ఇదిగో
- మనీశ్ కుమార్ అనే పారిశుద్ధ్య కార్మికుడికి తొలి వ్యాక్సిన్
- ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వేయించుకున్న మనీశ్
- అనంతరం వ్యాక్సిన్ వేయించుకున్న ఎయిమ్స్ డైరెక్టర్
అనంతరం రణ్‌దీప్ గులేరియా కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఎయిమ్స్ లో వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేయించుకున్న వారు అనంతరం వరుసగా వేయించుకున్నారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్ సామర్థ్యంపై నమ్మకం కలిగిచేందుకు ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఈ సందర్భంగా హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ వంటి ప్రక్రియను సమర్థంగా నిర్వహించడంలో భారత్‌కు గొప్ప అనుభవం ఉందని తెలిపారు. గతంలో పోలియో, స్మాల్‌పాక్స్ వంటి వ్యాధులను అంతం చేశామని చెప్పారు. కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల మంత్రులు, అధికారులు తొలి రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.