Ram Nath Kovind: రామ మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చిన రాష్ట్రపతి

  • రూ. 5,00,100 విరాళం ఇచ్చిన రామ్ నాథ్ కోవింద్
  • రాష్ట్రపతిని కలిసిన స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, అలోక్ కుమార్
  • ఫిబ్రవరి 27 వరకు కొనసాగనున్న విరాళాల సేకరణ
President Ram Nath Kovind donates rs 500100 to Ram Mandir Construction

అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తొలి విరాళం ఇచ్చారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు తన వంతుగా రూ. 5,00,100 విరాళాన్ని అందించారు. రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని రామ జన్మభూమి ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్ లు ఈరోజు ప్రారంభించాయి.

విరాళాల సేకరణలో భాగంగా దేశ ప్రథమ పౌరుడు కోవింద్ ను రామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా కోవింద్ తన విరాళం చెక్కును అందించారు. జనవరి 15 నుంచి విరాళాలను సేకరిస్తామని ట్రస్ట్ గతంలోనే ప్రకటించింది. ఫిబ్రవరి 27 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

దేశ వ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించనున్నట్టు ట్రస్ట్ తెలిపింది. అంతేకాదు, పారదర్శకత ఉండేందుకు రూ. 20 వేలు అంతకంటే ఎక్కువ మొత్తం విరాళాలను చెక్ రూపంలో సేకరించనున్నట్టు పేర్కొంది. రూ. 2 వేల కంటే ఎక్కువ ఇచ్చిన వారికి రశీదు ఇవ్వాలని కూడా నిర్ణయించింది.

More Telugu News