TRS: గాలిపటం ఎగరేస్తూ మూడో అంతస్తు నుంచి పడ్డ టీఆర్ఎస్ నాయకుడు.. మృతి
![trs leader dies in hyderabad](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-d81f8c635901.jpg)
- హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఘటన
- భవనంపై నుంచి ప్రహారీ గోడపై పడ్డ బంగారు కృష్ణ
- టీఆర్ఎస్ నాయకుల సంతాపం
హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఓ టీఆర్ఎస్ నాయకుడు గాలిపటం ఎగరేస్తూ భవనంపై నుంచి పడి మృతి చెందారు. సంక్రాంతి పండగ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు బంగారు కృష్ణ మూడో అంతస్తు ఎక్కి గాలిపటం ఎగరవేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పై నుంచి ఆయన ప్రహరీగోడపై అమర్చిన ఇనుపరాడ్లపై పడ్డారు. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతి పట్ల టీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.