Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణానికి నేటి నుంచి విరాళాల సేకరణ
- ప్రారంభించనున్న జన్మభూమి ట్రస్ట్, వీహెచ్‌పీ
- మొదట రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని నుంచి సేకరణ
- ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ
అయెధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణను రామ జన్మభూమి ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్ నేటి నుంచి ప్రారంభించనున్నాయి. మొదట రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నుంచి విరాళాలు సేకరించనున్నారు. రాష్ట్రపతిని ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్‌గిరి మహారాజ్, వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ కలవనున్నారు.
ఇటీవలి కాలంలో రాష్ట్రపతి నుంచి విరాళాలు సేకరించడం ఇదే తొలిసారి. నేటి నుంచి ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ కొనసాగుతుంది. రూ.2000 కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చే వారికి రశీదులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, విరాళాల్లో విదేశీ నిధులకు ఆస్కారం లేకుండా ట్రస్ట్ చూసుకుంటోంది.